రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు డీసెంట్ రోమ్ కామ్ చిత్రాల్లో ‘పతంగ్'(Patang) అనే సినిమా కూడా ఒకటి. దాదాపు కొత్త నటీనటులే ప్రధాన తారాగణంగా కొందరు సీనియర్ నటుల కలయికలో దర్శకుడు ప్రవీణ్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ సినిమా యువతని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఎక్కువ సినిమాల పోటీ ఉండడం మూలాన పెద్దగా రీచ్ సొంతం చేసుకోలేకపోయింది కానీ ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా ఓటిటి హక్కులు సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జనవరి 30 నుంచి అందుబాటులో ఉంటుంది అని వారు కన్ఫర్మ్ చేశారు. సో ఈ ఫన్ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు రేపటి నుంచి ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల, సహా ఎస్ పి చరణ్, ఎస్ ఎస్ కాంచి, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖులు కూడా నటించడం విశేషం. ఇక ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతం అందించగా విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కోతింటి, నాని బండ్రెడ్డి లు నిర్మాణం వహించారు.


