డ్రగ్ రాకెట్లో మరో లేడీ స్టార్.. ఇదీ రెస్పాన్స్

Published on Sep 23, 2020 1:30 am IST


సుశాంత్ సింగ్ మృతి కేసు కాస్త బాలీవుడ్లో నడుస్తున్న డ్రగ్ రాకెట్ వైపుకు మళ్లడంతో రోజుకోక సంచలన విషయం బయటపడుతోంది. సుశాంత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన నటి రియా చక్రబర్తి డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 20 మంది బాలీవుడ్ నటీనటుల పేర్లు చెప్పినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ ప్రకారమే సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనే లాంటి స్టార్ నటీమణుల పేర్లు బయటికొచ్చాయి. తాజాగా మరొక నటి దియా మీర్జా పేరు తెర మీదికి వచ్చింది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ సప్లయర్ దియా మీర్జాకు కూడ డ్రగ్స్ చేరవేసినట్టు చెప్పాడని, రేపో మాపో దియాను విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. దీంతో వెంటనే రియాక్ట్ అయిన దియా మీర్జా ‘ఈ వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న నా కెరీర్ మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి. నా జీవితంలో ఇప్పటివరకు డ్రగ్స్ సేవించడం, సరఫరా చేయడం లాంటివి చేయలేదు. ఈ తప్పుడు ఆరోపణల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More