నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే బాలన్స్ ఉన్న సాంగ్స్ షూటింగ్ ని కూడా ఫినిష్ చేయనున్నాడు. బాలకృష్ణ ఒకవైపు షూటింగ్ ని ఫినిష్ చేస్తూనే డిసెంబర్ 20న ఆంధ్ర రాజధాని అమరావతిలో చేయనున్న ఆడియో లాంచ్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న డిక్టేటర్ సినిమాకి సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వలన భారీ ప్యాకేజ్ లకి ఈ సినిమా అన్ని ఏరియాల రైట్స్ ని అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ రేటుకే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం బాలయ్య డిక్టేటర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తోందని అంటున్నారు. ఇది విన్న చాలా మంది షాక్ కి గురవుతున్నారు. ఇప్పుడున్న చాలా తక్కువ మంది యంగ్ హీరోస్ కి మాత్రమే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతోంది, కానీ సీనియర్ హీరో అయిన బాలయ్య సినిమాకి కూడా యంగ్ హీరోస్ కి ఈక్వల్ గా బిజినెస్ జరగడం అనేది యంగ్ హీరోస్ ని సైతం షాక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
40కోట్ల బిజినెస్ చేసుకోవడమే కాదు ఆ బిజినెస్ మార్క్ ని క్రాస్ చేసేలా డిక్టేటర్ కలెక్షన్స్ ఉంటాయని ఈ చిత్ర టీం ధీమా వ్యక్తం చేస్తోంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్.


