ఫస్ట్ టీజర్ తో సిద్దమైన ‘డిక్టేటర్’

ఫస్ట్ టీజర్ తో సిద్దమైన ‘డిక్టేటర్’

Published on Oct 23, 2015 8:36 AM IST

dictatoot
నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డిక్టేటర్’. బాలయ్య నటిస్తున్న ఈ 99వ సినిమాని సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో బాలయ్యని చాలా డిఫరెంట్ గా చూపడమే కాకుండా మోస్ట్ స్టైలిష్ లుక్ లో కూడా చూపించారు. అలాగే వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసిన గణేశా సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నందమూర్ అభిమానులను మరింత ఖుషీ చేయడం కోసం డిక్టేటర్ టీం దసరా కానుకగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్దమైంది.

ఈ రోజు సాయంత్రం డిక్టేటర్ ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేయనున్నారు. డైరెక్టర్ శ్రీవాస్ అభిమానులు పండుగ చేసుకునేలా రెండు డైలాగ్స్ తో కూడిన సూపర్బ్ టీజర్ ని కట్ చేసాడట. టీజర్ మరియు బాలయ్య లుక్ అందరినీ ఆకట్టుకుంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, అక్ష, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథను అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు