నా కెరీర్లో మోస్ట్ స్టైలిష్ మూవీ డిక్టేటర్ – బాలకృష్ణ

balakrishna

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరు, తన సినిమాలతో ఎన్నో సార్లు రికార్డ్స్ క్రియేట్ చేసిన నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో కూడా సక్సెఫుల్ గా చక్రం తిప్పుతున్నాడు. హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలకు కావలసిన వసతులను సమకూరుస్తూనే, తన అభిమానులకు కావాల్సిన సినిమాలను కూడా చేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ ఓ ఇంగ్లీష్ డైలీ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా డిక్టేటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. ‘డిక్టేటర్ అనే సినిమా నా కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ మూవీ అవుతుంది. ఇదివరకూ అభిమానులు నన్ను చూడని ఓ సరికొత్త రోల్ ని శ్రీవాస్ నాకోసం డిజైన్ చేసాడు. ఆ పాత్ర కోసం 12కేజీల బరువు కూడా తగ్గానని’ తెలిపాడు.

అలాగే తన 100వ సినిమా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి నా 100వ సినిమా గురించి ఆలోచించడం లేదు. మంచి కథ దొరికినప్పుడు అదే ఫిక్స్ అయిపోతుందని’ అన్నాడు. నానక్రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో నేటి నుంచి డిక్టేటర్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు ఇరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version