విషపూరితమైన ప్రపంచంలోకి అడుగు పెట్టానంటున్న హీరో !

Published on Sep 25, 2018 12:51 pm IST

ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ మోజులో పడి.. ఎక్కువగా ఫోన్ మీదే ఆధారపడుతున్నప్పటికీ, యంగ్ హీరో నాగశౌర్య మాత్రం ఆశ్చర్యకరంగా ఇన్నాళ్లు తనకంటూ స్వంతంగా ఒక ఫోన్ అంటూ మెయింటైన్ చెయ్యలేదు. ఎట్టకేలకు నాగశౌర్య తన మనసు మార్చుకున్నట్లు ఉన్నాడు. ఈ రోజు నుంచి తానూ కూడా ఫోన్ వాడుతున్నట్లు ప్రకంటించాడు.

ఈ ఉదయం నాగశౌర్య తన ట్విట్టర్ ద్వారా.. చేతిలో ఒక స్మార్ట్ పట్టుకొని ఉన్న తన ఫోటోని పోస్ట్ చేస్తూ. “ఇన్ని సంవత్సరాల తర్వాత, మళ్లీ నా చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ .. చివరకు నేను కూడా ఈ విషపూరితమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాను’ అని పోస్ట్ చేశాడు.

ఇక, ఛలో సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న నాగశౌర్యకు ‘అమ్మమ్మగారిళ్లు’ మరియు ‘@నర్తనశాల’ చిత్రాలు బ్రేక్ వేశాయి. కాగా ప్రస్తుతం నాగ‌శౌర్య‌, కొత్త దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో నటిస్తున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :