రవితేజ సినిమాకు టైటిల్ మార్చారా..?

రవితేజ సినిమాకు టైటిల్ మార్చారా..?

Published on Aug 27, 2026 1:00 AM IST

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అయితే, ఈ సినిమాకు గతంలో ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలించారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమా టైటిల్‌ను ‘దాగుడు మూతలు దండాకోర్’గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటిలో ఏ టైటిల్‌ను దిల్ రాజు టీమ్ ఖరారు చేస్తుందో చూడాలి. మరి నిజంగానే రవితేజ చిత్రానికి తొలుత అనుకున్న టైటిల్‌ను మారుస్తారా..?

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు