మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేసిన పెద్ది ఇప్పుడు భారీ లెవెల్లో పాన్ ఇండియా వైడ్ గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ దగ్గరకి వస్తున్న సమయంలో మన తెలుగు స్టేట్స్ లో పెద్ది రిలీజ్ కి ఊహించని టెన్షన్ ఎదురైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ నడుమ మొదలైన పర్సెంటేజి వ్యవహారం ఎటెటో వెళ్లడం అది పెద్ది సినిమాపైనే గట్టిగా ఎఫెక్ట్ చూపించేలా మారడం ఫ్యాన్స్ ని మరింత టెన్షన్ పెట్టింది.
అయితే ఈ అంశంపై నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ లో లేటెస్ట్ గా జరిగిన మీట్ తర్వాత మీట్ అంతా సజావుగా జరిగింది అని ఇప్పుడు రాబోతున్న పెద్ది చిత్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని హామీ ఇవ్వడంతో పెద్ది చిత్రానికి సింగిల్ స్క్రీన్స్ పరంగా బిగ్ రిలీఫ్ దక్కింది అని చెప్పొచ్చు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది భారీ ఎత్తున విడుదలై సరికొత్త నంబర్స్ సెట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.


