పెద్ది కోసం జాన్వీ నెవర్ బిఫోర్ ఫీట్.. ఆమే సొంతంగా..!

పెద్ది కోసం జాన్వీ నెవర్ బిఫోర్ ఫీట్.. ఆమే సొంతంగా..!

Published on May 16, 2026 2:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుండగా, జూన్ 3నే ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 18 నుంచి ‘పవర్‌ప్లే టూర్’ ప్రారంభం కానుంది. అలాగే, చిత్ర యూనిట్ ముంబైలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

​ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న జాన్వీ కపూర్, తన పాత్రకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెపుతుండటం విశేషం. ఆమె కెరీర్‌లో తెలుగులో సొంతంగా వాయిస్ ఇస్తుండటం ఇదే తొలిసారి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో యాస చాలా ముఖ్యం. ఆ స్లాంగ్‌ను పక్కాగా పలికించడం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ, పాత్రలో సహజత్వం కోసం జాన్వీ ఈ సవాలును స్వీకరించి డబ్బింగ్ పూర్తి చేస్తోంది.

​వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో చాలా కీలకంగా ఉండబోతోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు టేకింగ్, మరియు మొదటిసారి వెండితెరపై మెరవబోతున్న చరణ్ – జాన్వీల ఫ్రెష్ పెయిరింగ్ చూడటానికి ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు