సమీక్ష: ‘దూరదర్శిని’ – అవుట్ డేటెడ్ విలేజ్ లవ్ డ్రామా

సమీక్ష: ‘దూరదర్శిని’ – అవుట్ డేటెడ్ విలేజ్ లవ్ డ్రామా

Published on May 15, 2026 8:30 PM IST

విడుదల తేదీ : మే 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సువిక్షిత్, గీతికా రతన్, కిట్టయ్య, విజయ్ కృష్ణా రెడ్డి, భాస్కర్, బాలరాజు, పాండు తదితరులు
దర్శకుడు : కార్తికేయ కోమి
నిర్మాణం : వారాహ మూవీ మేకర్స్
సంగీతం : ఆనంద్ గుఱ్ఱన
ఛాయాగ్రహణం : మురళీ మోహన్ రెడ్డి, సతీష్ కుమార్
కూర్పు : బి తిరుపతి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన చిత్రాల్లో యువ నటీనటులు సువిక్షిత్ బొజ్జ అలాగే గీతికా రతన్ హీరోయిన్స్ గా నటించిన పీరియాడిక్ విలేజ్ డ్రామా “దూరదర్శిని” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

మట్టుపర్రి అనే ఓ మారుమూల గ్రామంలో అప్పుడప్పుడే టీవీ వస్తున్న సందర్భం అది. ఆ టీవీలో దూరదర్శిని చూసేందుకు వచ్చిన వారిలో హరి (సువిక్షిత్ బొజ్జ) అలాగే వాణి (గీతికా రతన్) లు తమ ప్రేమను పంచుకుంటారు. అయితే ఇద్దరి మధ్య కుల భేదం ఉంటుంది. కానీ తమ ఊర్లో అలాంటివి ఏమి ఉండవు కానీ తర్వాత అక్కడి రాజకీయాలు మూలాన తమ మధ్యలో కులం చిచ్చు పెడుతుంది. ఈ క్రమంలో వాణి అన్నయ్య పరశురామ్ (విజయ్ కృష్ణా రెడ్డి) తన కులానికే చెందిన తన సన్నిహితుడు పేక (భాస్కర్ గొడుగునూరు) ఏం చేసాడు? కులాన్ని దాటి ఆ జంట పెళ్లి వరకు వెళ్ళారా లేదా? ఈ ప్రయాణంలో వారికి ఏమైంది? ఏం నష్టపోయారు అనేది ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో ఫస్టాఫ్ ఒకింత ఓకే అనిపిస్తుంది అని చెప్పొచ్చు. గ్రామీణ నేపథ్యంలో చూపించిన కొన్ని సన్నివేశాలు కానీ వింటేజ్ మూమెంట్స్ డీసెంట్ గా ఉన్నాయి. అంతే కాకుండా హీరో సహా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ నడుమ సన్నివేశాలు మంచి ఫన్ ని అక్కడక్కడా జెనరేట్ చేస్తాయి. వారిలో నటుడు బాలరాజుపై కామెడీ సీన్స్ బాగున్నాయి అలానే మరో ఫ్రెండ్ గా కనిపించిన పాండు టైమింగ్ వంటివి వీరి ఎపిసోడ్స్ లో బాగుణ్నయి.

అలానే లీడ్ జంట తమ పాత్రలు పరిధి మేరకు మంచి ఎమోషన్స్ తో నటించే ప్రయత్నం చేశారు. సువిక్షిత్ పల్లెటూరి కుర్రాడిగా గీతికా ఒక ఇనోసెంట్ అమ్మాయిగా ఇద్దరి జంట కెమిస్ట్రీ పంచుకునే ప్రయత్నం చేశారు. వీరి అందరి కంటే నటుడు కిట్టయ్య తన పెర్ఫామెన్స్ తో మెప్పించారని చెప్పొచ్చు. తన కొడుకు కోసం తాపత్రయం పడే తండ్రిగా

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కనిపించే నేపథ్యం కొత్తదేమీ కాదు ఎన్నో సినిమాల్లో ఈ కులం/ప్రేమ కాన్సెప్ట్ లు మనం చూసేసాం ఇందులో ఏదన్నా కొంచెం బాగున్నా అంశం ఏదన్నా ఉంది అంటే కొంచెం కామెడీ, ఆ గ్రామీణ నేపథ్య సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఇవి మినహాయిస్తే మిగతా సినిమా అంతా చాలా బోరింగ్ అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ లో కనిపిస్తుంది.

ఫస్టాఫ్ కి కొంచెం పర్వాలేదు అనుకుంటే సెకండాఫ్ మాత్రం దర్శకుడు డిజప్పాయింటింగ్ గా నడిపించారు. అనవసర పాటలు, వాటిలో సోల్ ఉండదు వాటి ప్లేస్మెంట్ వంటివి చిరాకు తెప్పిస్తాయి. అలానే ఇంటర్వెల్ ముందు ఘర్షణని సెకండాఫ్ లో అసలు కొనసాగించలేదు. చాలా బలహీనంగా సెకండాఫ్ సాగుతుంది.

అలాగే లాజికల్ గా కూడా సినిమా బాగా డిజప్పాయింట్ చేస్తుంది. ఆ ఊరులో హీరోయిన్ అన్నయ్యే పెద్ద, ఊర్లో ఉత్సవం చేయించాలన్నా తానే డబ్బులు ఇస్తా అంటాడు. కానీ తన సొంత చెల్లెలు టీవీ చూడాలి అంటే ఊర్లో ఇంకో ఇంటికి వెళ్లి చూడాలి. ఊర్లో పెద్ద రాయల్ ఇన్ ఫీల్డ్ బుల్లెట్ నడిపే తన అన్న ఇంట్లో ఒక టీవీ పెట్టుకోలేదా? అనేది లాజిక్ గా ఉండదు.

ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ట్విస్ట్ తో ఏదో కదిలించే ప్రయత్నం చేశారు కానీ అది ఏమాత్రం వర్క్ అవ్వలేదు. పైగా ఇతర ఎమోషనల్ సీన్స్ కూడా చూసే ఆడియెన్ ని కదిలించలేదు. క్లైమాక్స్ లో ఇలాంటి వీక్ రైటింగ్ మూలాన కిట్టయ్య పెర్ఫామెన్స్ పూర్తిగా వృథా అయ్యింది. పైగా ఈ సినిమాలో ఈ మధ్యనే వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ, డెకాయిట్ సినిమాల్లో సీన్స్ కూడా గుర్తొస్తాయి. వీటితో పాటుగా సినిమాలో చాలా సీన్స్ స్లో అవుతూ డబ్బింగ్ సంబంధం లేకుండా వీక్ గా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కూడా నీట్ గా ఉంది.మురళీ మోహన్ రెడ్డి, సతీష్ కుమార్ ల కెమెరా వర్క్ బాగుంది. పల్లెటూరు వాతావరణం సీన్స్ తాను అందంగా తెరకెక్కించారు. ఆనంద్ గుఱ్ఱన సాంగ్స్ బాగున్నాయి ఒక్కటి తప్ప. బాలు ఎస్ నేపథ్య గీతం పర్వాలేదు. ఎడిటింగ్ సెకండాఫ్ లో బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు కార్తికేయ కొమి విషయానికి వస్తే.. తన వర్క్ డిజప్పాయింటింగ్ గానే ముగుస్తుంది. ఫస్టాఫ్ ని ఓ మోస్తరుగా బాగానే హ్యాండిల్ చేసిన తాను సెకండాఫ్ లో పూర్తిగా తడబడ్డారు. డల్ కథనం, సీన్స్ తో నడిపించి లాజిక్స్ లేకుండా బోర్ కొట్టించారు. సెకండాఫ్ పై ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘దూరదర్శిని’ ఒక బోరింగ్ విలేజ్ డ్రామాగా మిగిలిపోయింది. చాలా రొటీన్ కథా, కథనాలు ఇందులో బోర్ కొట్టిస్తాయి. ఫస్టాఫ్ లో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తప్పితే ఇందులో సోల్ బాగా మిస్సయ్యింది. సో ఈ దూరదర్శినికి దూరంగానే ఉంటే మంచిది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు