జోరుగా దిల్‌రాజు ‘కేరింత’ ప్రమోషన్స్!

జోరుగా దిల్‌రాజు ‘కేరింత’ ప్రమోషన్స్!

Published on Jun 7, 2015 7:02 PM IST

kerinta
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే! సుమంత్ అశ్విన్, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ వారమే విడుదలకు సిద్ధమైంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉన్నందున దిల్‌రాజు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్ యూత్ కావడంతో సెలవు రోజుల్లో యూత్ ఎక్కువగా గడిపే పలు షాపింగ్ మాల్స్‌లలో సినిమా యూనిట్ ప్రచారాలు సాగిస్తున్నారు. నేడు హైద్రాబాద్‌లో ఈ కార్యక్రమాలు జరపగా, రేపు వైజాగ్‌లో ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జూన్ 12న ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు దిల్‌రాజు సన్నాహాలు మొదలుపెట్టేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు