హీరోల రెమ్యూనరేషన్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

హీరోల రెమ్యూనరేషన్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Published on Jun 27, 2026 9:59 AM IST

Dil-Raju

టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు పెరగడం వల్ల సినిమాల బడ్జెట్లు భారీగా ఎక్కువవుతున్నాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రూ.300 కోట్ల బడ్జెట్ సినిమాలో 35-40 శాతం కేవలం హీరో రెమ్యునరేషన్‌కే సరిపోతుందని ఆయన అన్నారు. తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో టాప్ హీరోలు పారితోషికాలు తగ్గించుకోవడం లేదని ఆయన తెలిపారు.

​ఈ క్రమంలో బాలీవుడ్ హీరోల పనితీరును ఆయన ఉదాహరణగా చెప్పారు. అక్కడ స్టార్స్ అందరూ ముందస్తు రెమ్యూనరేషన్ కాకుండా ‘ప్రాఫిట్ షేరింగ్’ (లాభాల్లో వాటా) పద్ధతిని పాటిస్తున్నారని, మన టాలీవుడ్‌లో కూడా ఈ విధానం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

​ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఒకప్పుడు రూ.130 కోట్లు తీసుకునేవారని, కానీ మార్కెట్ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆయన కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మోడల్ వల్ల నిర్మాతలకు భారం తగ్గి, హీరోలలో కూడా బాధ్యత పెరుగుతుందని ఆయన వివరించారు.

తాజా వార్తలు