మరో హిట్ కొట్టబోతున్నాడు – దిల్ రాజు

Published on Jun 1, 2019 1:00 am IST

సూపర్ స్టార్ కృష్ణగారి 75వ జన్మదినం సందర్భంగా ఈ రోజు మహేశ్ బాబు 26వ సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్స్ లో ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అని టైటిల్ ఫిక్స్ చేశారు.

కాగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ కృష్ణ గారికి 75 వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మహేష్ బాబుగారి 26వ సినిమా లాంచ్ అవుతున్నందుకు చాల సంతోషంగా ఉంది. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రాబోతుంది. F2 సినిమాలాగే ఈ సినిమా కూడా అందరికి మంచి వినోదాన్ని పంచబోతుంది. అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టబోతున్నాడు’ అని దిల్ రాజు చెప్పారు.

ఇక మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More