జాను ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న దిల్ రాజు

Published on Feb 7, 2020 9:05 am IST

దిల్ రాజు మెదటిసారి ఓ రీమేక్ చేశారు.తమిళ చిత్రం 96 ని తెలుగులో జాను గా రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు మనసుపెట్టి తీశారట. ఒరిజినల్ 96 మూవీని విడుదలకు ముందే చూసిన దిల్ రాజు రిజల్ట్ రాకముందే 96రీమేక్ హక్కులను దక్కించుకున్నారట. అక్కడ ఆ మూవీ ఓ క్లాసిక్ గా మిగిలిపోవడంతో దాన్ని రీమేక్ చేయడం సాహసం అంటున్నారు అందరూ. ఐతే 96 మూవీ తన మనసుకు ఎంతగానో నచ్చిందట. అందుకే విమర్శలకు భయపడకుండా నిర్మించారట. అందుకే జాను ఫలితం గురించి ఆయన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

జాను చిత్రంలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఒరిజినల్ 96కి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జాను కి సంగీతం గోవింద్ వసంత్ అందించారు. జాను మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది.

సంబంధిత సమాచారం :