దిల్ రాజుకు కరోనా పాజిటివ్

Published on Apr 13, 2021 4:20 pm IST

టాలీవుడ్ పరిశ్రమలోనూ కరోనా తాకిడి ఎక్కువైంది. ఇటీవల ప్రముఖ నటీనటులు వైరస్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్ తీసుకున్నారట. గత నాలుగైదు రోజులుగా తనతో సన్నిహితంగా ఉంటున్న అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోమని చెప్పారట. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

గత కొన్నిరోజులుగా దిల్ రాజు చాలా హుషారుగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే తన కోరిక ‘వకీల్ సాబ్’ సినిమాతో తీరడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రిలీజ్ రోజున ఒక అభిమానిలా మారిపోయి థియేటర్లో పేపర్లు విసిరి ఎంజాయ్ చేశారు. చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆయన సంతోషం డబుల్ అయింది. చాలా యాక్టివ్ గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతలోనే వైరస్ సోకడంతో ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారట.

సంబంధిత సమాచారం :