ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చూపంతా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఉంది. ఇప్పటికే శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మిస్తున్నారు ఆయను. ఇది పాన్ ఇండియా మూవీ. బడ్జెట్ అటు ఇటుగా 300 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఫ్రీ అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఇదిలా ఉండగానే దిల్ రాజు ఇంకో పాన్ ఇండియా సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈసారి ఏకంగా ప్రశాంత్ నీల్ తో సినిమా నిర్మిస్తున్నారట. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే దిల్ రాజు, ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి విజయ్ తో చర్చలు జరిపారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ ప్రస్తుతం తన 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. తర్వాత 66వ సినిమాను లోకేష్ కానగరాజ్ డైరెక్షన్లో చేసే యోచనలో ఉన్నారు. ఈ సినిమాల తర్వాత 67 లేదా 68వ సినిమాగా ప్రశాంత్ నీల్, దిల్ రాజుల సినిమాను చేస్తారని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే విజయ్, ప్రశాంత్ నీల్ కలయిక క్రేజీ కాంబినేషన్ అవుతుంది.


