రజని దర్శకుడి అరెస్ట్ తప్పదా…?

Published on Jun 23, 2019 12:17 pm IST

దర్శకుడు పా.రంజిత్‌కు రాజరాజ చోళన్‌ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనపై కేసు నమోదైంది. మధురై హైకోర్టు శాఖలో పా.రంజిత్‌పై పిటిషన్‌ దాఖలు కావడంతో ఆయన మందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకున్నారు.

దీంతో కోర్టు పా.రంజిత్‌ను ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్‌ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంతో ఆ గడువు పూర్తి కావడంతో పా.రంజిత్‌ మందస్తు బెయిల్‌ కోసం మరోసారి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీనిపై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దీనితో దర్శకుడు పా.రంజిత్ త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కలదు అని సమాచారం. పా.రంజిత్ సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా కబాలి, కాలా వంటి పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More