స్టార్ హీరోని ‘చీప్ స్టార్’ అన్న డైరెక్టర్ ?

స్టార్ హీరోని ‘చీప్ స్టార్’ అన్న డైరెక్టర్ ?

Published on Sep 3, 2019 4:27 PM IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమాకి మాత్రం బాగా విరామం తీసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అజ‌య్ భూప‌తి మాస్ మహారాజా రవితేజతో తన రెండో సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో క్లాస్ హీరో అనిపించుకున్న సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నట్లు.. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అజయ్ భూపతి చెప్పిన స్క్రిప్ట్ కి రవితేజ కన్వీన్స్ కాలేదని, అందుకే సినిమా చేయడానికి అంగీకరించలేదని సమాచారం. అయితే అజయ్ భూపతి మాత్రం ఉన్నట్లు ఉండి ‘చీప్ స్టార్’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్ రవితేజను దృష్టిలో పెట్టుకునే అజయ్ ట్వీట్ చేశాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా అజయ్ భూపతి మాత్రం ఇదే స్క్రిప్ట్ ను నాగ్ చైతన్యకి చెప్పాలని చూస్తున్నాడట. సమంతకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చిందట. మరి నాగచైతన్య అజయ్ కి ఛాన్స్ ఇస్తాడా..!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు