ఆర్ ఎక్స్100 డైరెక్టర్ తో సెన్సేషనల్ స్టార్ హీరో…!

Published on Sep 12, 2019 3:52 pm IST

ఎట్టకేలకు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కొత్త మూవీ మొదలుకానుంది. భవ్య క్రియేషన్స్ ఆయనతో ఓమూవీ చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ వారు ఓ అధికారిక అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. మరి అజయ్ భూపతి చిత్రంలో నటించనున్న హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. ఎందుకంటే భవ్య క్రియేషన్స్ వారు ఓ సెన్సేషనల్ స్టార్ హీరో నటించబోతున్నారు అని హింట్ ఇచ్చారు కానీ, ఆయనెవరో తేల్చి చెప్పలేదు.

ఐతే అజయ్ భూపతి చిత్రంలో మాస్ మహరాజా రవి తేజ నటించాల్సిఉండగా ఆయన కొన్ని అనివార్య కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆర్ ఎక్స్100 విడుదలై దాదాపు ఏడాది దాటిపోయింది, మరో చిత్రం పట్టాలెక్కించడానికి అజయ్ భూపతికి ఇంత సమయం పట్టింది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More