టాలీవుడ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడి నుంచి రీసెంట్ గా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు హిట్ తర్వాత తన తదుపరి సినిమా ఏంటి ఇతర డీటెయిల్స్ చాలానే సోషల్ మీడియాలో బయటకొచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఫలానా టైటిల్, ఈ నటీనటులు ఉన్నారంటూ కొన్ని పేర్లు కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ లీక్స్ అన్నింటిపై అనీల్ రావిపూడి తన ఎక్స్ వేదికగా అసలు క్లారిటీ అందించారు.
“నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా నటినటులు కధ, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో . మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను… అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన పూర్తి వివరాలు.. మీకు అందిస్తాం..” అంటూ అసలు విషయం చెప్పారు. సో తన ప్రాజెక్ట్ విషయంలో బయట వినిపిస్తున్న రూమర్స్ అన్నీ ప్రస్తుతానికి అవాస్తవం అనే చెప్పాలి. మరి అధికారికంగా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి.
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
నటినటులు
కధ
టైటిల్ కూడా
పెట్టేసారు
ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄
మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను….
అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన
పూర్తి వివరాలు… మీకు… pic.twitter.com/bfhQ4NrOfu— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026


