మెగా ప్రాజెక్ట్ కి భారీ రెస్పాన్స్ మరింత భాద్యత పెంచింది.!

Published on Aug 24, 2021 7:02 pm IST

మొన్న మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తన రానున్న భారీ ప్రాజెక్ట్స్ పై కూడా సాలిడ్ అనౌన్సమెంట్స్ వచ్చాయి. అయితే వాటిలో రీమేక్స్ కాకుండా దర్శకుడు బాబీతో ప్లాన్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మెగాస్టార్ 154వ చిత్రంగా దీనిని ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని రెడీ చేసి వదలగా దానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా అయితే అందులో చిరు లుక్ వింటేజ్ మోడ్ ని గుర్తు చెయ్యడంతో బాబీ ప్రాజెక్ట్ పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ పై దర్శకుడు బాబీ స్పందించారు. ఇంతటి భారీ రెస్పాన్స్ తనకి ఈ చిత్రంపై మరింత భాద్యతను పెంచింది అని అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు. అలాగే ఈ చిత్రంతో వింటేజ్ మెగాస్టార్ మళ్ళీ ప్రెజెంట్ చేసేందుకు కూడా ఈ రెస్పాన్స్ దోహద పడింది అని అందరి ఆశీస్సులతో తప్పకుండా తన బెస్ట్ ని ఈ చిత్రానికి అందిస్తానని బాబీ తెలిపాడు.

సంబంధిత సమాచారం :