కళ్యాణ్ కృష్ణ స్థానంలో డైరెక్టర్ బాబి ?

కళ్యాణ్ కృష్ణ స్థానంలో డైరెక్టర్ బాబి ?

Published on Feb 27, 2018 6:11 PM IST

bobby

అల్లుడు శ్రీను, బలుపు సినిమాలతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న బాబి డైరెక్టర్ గా మారి చేసిన పవర్, జై లవకుశ సినిమాలు మంచి విజయం సాధించాయి. బాబి చెయ్యబోయే తదుపరి సినిమాపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ డైరెక్టర్ మల్టి స్టారర్ సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.

నాగ చైతన్య , వెంకటేష్ కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ ఒక సినిమా చెయ్యబోతున్నట్లువార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా మొదలు కాలేదు. ఇప్పుడుఅదే స్థానంలో బాబి వచ్చినట్లు సమాచారం. నాగ చైతన్య ప్రస్తుతం సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే వెంకటేష్ తేజ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తరువాత వెంకటేష్, చైతు కలిసి చేసే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు