జయలలిత బయోపిక్ కు దర్శకుడు ఎవరంటే !

జయలలిత బయోపిక్ కు దర్శకుడు ఎవరంటే !

Published on Aug 15, 2018 11:33 PM IST

అలనాటి నటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి’ పురిచ్చి తలైవి’ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నారని తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకం ఫై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈయన ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ అలాగే కపిల్ దేవ్ బయోపిక్ ’83’ చిత్రాలను నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 న లాంచ్ కానుంది. మరి ఈచిత్రంలో జయలలిత పాత్రకు ఎవరిని తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు