ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన టికెట్ ధరల విషయం సినీ పరిశ్రమ లో చర్చాంశనీయంగా మారింది. ఈ అంశం పై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. ఈ మేరకు దేవకట్టా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
సినిమా టికెట్ల విషయం మర్చిపోండి, స్వీయ దిద్దుబాటు, డిమాండ్ ఆధారిత మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థ లో ఏదైనా ప్రైవేట్ ఉత్పత్తి పై ప్రభుత్వం రేట్లను నిర్ణయించడం అనేది పూర్తిగా అప్రజాస్వామికం, చట్ట విరుద్ధం, నియంతృత్వం అంటూ చెప్పుకొచ్చారు. మనలో మెజారిటీ ఈ ప్రాథమిక వాస్తవాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి, ఆనందిద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Forget movie tckts, govt fixing rates on any private “product” in a self-correcting, demand based market economy is absolutely undemocratic, illegal & dictatorial! Since “majority” of us don’t even understand this basic fact, let’s just enjoy this “wreck” of a ride together!! ????
— dev katta (@devakatta) December 23, 2021


