ఇంటర్వ్యూ : హను రాఘవపూడి – శర్వానంద్ ని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను !

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ సందర్భంగా పాటల దర్శకుడు హను రాఘవపూడి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

హను రాఘవపూడి బలం లవ్ స్టోరీ అని బయట టాక్ ఉంది. అది మీరు నమ్ముతారా ? నమ్మరా ?

మన బలం మనకెప్పుడూ తెలియదండి. ఆవతల వాళ్ళు చెబితేనే తెలుస్తోంది. నా సినిమాలు చూస్తుంటే.. బలం లవ్ స్టోరీనే అని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. బట్ లవ్ స్టోరీస్ మాత్రమే నా బలం కాదు. మిగతా వాట్టిల్లో కూడా నేను బలంగానే ఉన్నాననుకుంటున్నాను.

ఈ ‘పడి పడి లేచె మనసు’ గురించి చెప్పండి ?

ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రేమ కథ. సింపుల్ గా ఇలా ప్రేమకథ అని చెబితే రొటీన్ గానే ఉంటుంది. కానీ కొత్తగా ప్రేమ కథ అంటూ ఏది లేదని నేను నమ్ముతాను. కాకపోతే ఒకొక్క దర్శకుడు వారి పాయింటాఫ్ వ్యూని బట్టి, వారు పుట్టి పెరిగిన వాతావారణాన్ని బట్టి, వారు చూసిన జీవితాన్ని బట్టి, లవ్ స్టోరీస్ ను వాళ్ళు డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. నేను నా విజన్ కి తగ్గట్లుగా ఈ లవ్ స్టోరీని డీల్ చేశాను.

ఈ సినిమాకి ‘పడి పడి లేచె మనసు’ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి ?

అసలు ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ ను నుండే ఈ కథ పుట్టిందండి. శర్వానంద్ ని దృష్టిలో పెట్టుకునే ఈ లవ్ స్టోరీని రాశాను. అలాగే స్టోరీ రాస్తున్నప్పుడే సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నాను. ఈ జోడి నిజంగానే లవర్స్ అనేంతగా మనల్ని నమ్మిస్తారు.

మీ ప్రేమకథలు వైవిధ్యంగా ఉంటాయి. అలా ఉండటానికి కారణం మీ జీవితంలో ఉన్న ప్రేమ అనుభవాలేనా ?

నన్ను చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. కానీ మన జీవితంలో మనకి దగ్గరగా ఉన్న వాటి పైన మనకి ఎప్పుడూ విలువ ఉండదు, అంటే మన లైఫ్ లో లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయనుకొండి. వాటికి మనం పెద్దగా ఎగ్జైట్ అవ్వం, పెద్దగా పట్టించుకోము. మన దగ్గర లేని దాని పైనే మనకి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. నా లైఫ్ లో లవ్ స్టోరీస్ లేవు. కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, వాటినే కథలుగా రాస్తున్నా.

ప్రేమకథలను మీరు మణిరత్నంలా తీస్తారు అని పేరు ఉంది. ఆయన సినిమాల ప్రభావం మీపైనా ఉందా ?

ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. పైగా మణిరత్నంగారు అంటే నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. నేను ఆయనలా తీస్తున్నాను అని ఎవరైనా అంటే.. అది నేను చాలా ప్రశంసలా ఫీల్ అవుతాను.

ఈ సినిమా బడ్జెక్ట్ అనుకున్న దానికి కంటే ఎక్కువ అయింది అంట కదా ?

అవునండి. అనుకున్న దానికి కంటే కొంత ఎక్కువే అయింది. కాకపోతే ఓవర్ బడ్జెక్ట్ అవ్వలేదు. ఆ బడ్జెక్ట్ కూడా పెరగడానికి కారణం.. ఎక్కువ లైవ్ లోకేక్షన్స్ లో షూట్ చెయ్యటమే. లైవ్ లోకేక్షన్స్ లో షూటింగ్ అనేది మన చేతుల్లో ఉండదు. అక్కడ ఎదురయ్యే కొన్ని అనుకోని పరిస్థితులకు షూట్ లేట్ అవుతా ఉంటుంది. దాని వల్లే బడ్జెక్ట్ పెరిగింది. బట్ పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తోంది.

నాని కోసం మిలటరీ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ రాస్తున్నా అన్నారు. ఆ మధ్య నాని కూడా అనౌన్స్ చేశారు. ఆ కథ రాశారా ?

ఆ కథ అయిపోయింది అండి. అలాగే ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. కాకపోతే నాని గెటప్ ని టోటల్ గా మార్చాలి. సీజన్ బట్టి చెయ్యాలి, అంటే తన టైంని బట్టి, నా టైంని బట్టి వీలు చూసుకొని చెయ్యాలి.

మీ తదుపరి సినిమా ఏ బ్యానర్ లో ఉంటుంది ? ఎవరితో ఉంటుంది ?

నా తరువాత మూవీ మైత్రిలో ఉంటుంది. సమ్మర్ లో స్టార్ట్ అవుతుంది. అది కూడా లవ్ స్టోరీనే. దానిలో హీరో హీరోయిన్లను ఇంకా అనుకోలేదు.

Exit mobile version