డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య వార్.. మామూలుగా లేదుగా..!

Published on Sep 12, 2021 3:01 am IST


హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్.. హ్యాట్సాఫ్ సాయి తేజ్ అని అన్నారు. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని, బతికేస్తున్న అందరు బాగుండాలి, వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

అయితే హరీశ్ శంకర్ చేసిన ట్వీట్‌కు దొంతు రమేశ్ స్పందిస్తూ ఈ మధ్య మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయిందని, తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు అని దొంతు రమేశ్ అన్నాడు.

ఇకపోతే మళ్ళీ దీనికి బదులిచ్చిన హరీశ్ నేను “తప్పుడు వార్తలు“ అని క్లియర్‌గా చెప్పానని, మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు… అంటే మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. అంతేకాదు మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు సమాధానం చెప్పుకుంటామని, మీకేముంది మీరు దేనికి సమాధానం కాస్త చెబుతారా అని ప్రశ్నించారు. రమేశ్ గారు నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నానని హరీశ్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :