అలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయకండి – హరీష్ శంకర్

అలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయకండి – హరీష్ శంకర్

Published on Dec 15, 2023 8:46 PM IST

Harish
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ ప్రధాన ఒక చిత్రం చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో హీరోయిన్స్ విషయం లో వస్తున్న రూమర్స్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు.

రవితేజ – హరీష్ శంకర్ ల సినిమా కోసం మీనాక్షి చౌదరి ను సంప్రదించగా, తన డేట్స్ సర్దుబాటు చేయలేక రిజెక్ట్ చేసింది అని, ఇలియాన ను సంప్రదించగా, రెమ్యునరేషన్ వల్ల రిజెక్ట్ చేసింది అని అన్నారు. అయితే తృప్తి డిమ్రి ను మేకర్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కొందరు పేర్కొన్నారు. దీని పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ, ఇవి పూర్తి గా తప్పు అని యానిమల్ చిత్రం కంటే ముందుగానే నటీనటుల ఎంపిక పూర్తి అయింది అని అన్నారు. అలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు