పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా నటిస్తోన్న సినిమా మెహుబూబా. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు కొని విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసేందే. మే 11 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీని సందర్శించడం జరిగింది.
మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ తో చిత్ర యూనిట్ ముచ్చటించడం జరిగింది. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు పూరి జగన్నాధ్ సమాధానం ఇవ్వడం జరిగింది. 2 నిమిషాల ట్రైలర్ ను చిత్ర యూనిట్ కట్ చెయ్యడం జరిగిందని సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో ఈ ట్రైలర్ ను అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు. గతంలో సూపర్ సినిమాకు సంగీతం అందించిన సందీప్ చౌతా ఈ సినిమాకు వర్క్ చేసారు.


