క్రిష్ ఈసారి సైలెంట్‌గా కానిస్తాడా..?

‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’ వంటి చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్ జగర్లాముడి, గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ‘ఎన్టీఆర్ బయోపిక్’, ‘కొండపొలం’, ‘ఘాటి’ చిత్రాల ప్లాప్స్ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ నుండి కూడా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ ఒడిదొడుకుల తర్వాత క్రిష్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా కొంతమంది యంగ్ యాక్టర్స్‌తో ఒక కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైనింగ్ డ్రామా షూటింగ్‌ను సైలెంట్‌గా ప్రారంభించినట్లు సినీ వర్గాల టాక్.

క్రిష్ సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందట. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా క్రిష్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version