‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ సాంగ్ : థమన్ సౌండింగ్‌కు అనిరుధ్ మ్యాజిక్ వేరే లేవెల్..!

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకుడు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో మూగ, చెవుడు ఉన్న వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి ‘హాయ్ రే’ అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎస్.ఎస్. థమన్, అనిరుధ్ రవిచందర్ మళ్లీ కలవడం విశేషం. థమన్ అందించిన మెలోడియస్ అండ్ క్యాచీ ట్యూన్‌కు, అనిరుధ్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో మరింత ఊపును తీసుకువచ్చారు.

ఈ పాటలో సంజన ఆలపించిన కర్ణాటక సంగీతం, హర్షవర్ధన్ ర్యాప్ పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో అనీష్ తన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ మరియు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోగా, హీరోయిన్‌పై హీరోకు ఉన్న మూగ ప్రేమను కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ చాలా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేశాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version