ఐపీఎల్ ఫీవర్.. ‘పెద్ది’తో బాక్సాఫీస్ మోత మోగాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ సరిగ్గా మరో వారంలో.. అంటే జూన్ 4న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు కలిసివచ్చే అతిపెద్ద అంశం ఏమిటంటే.. మే 31తో ఐపీఎల్ హడావుడి ముగిసిపోతుండటం. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలోనే ఈ సినిమా వచ్చి ఉంటే, ప్రేక్షకుల దృష్టి క్రికెట్ వైపు మళ్లీ కలెక్షన్లపై ప్రభావం పడేది. కానీ ఐపీఎల్ దాడి నుంచి ఇప్పుడు పెద్ది సేఫ్ అని ఫిక్స్ అయిపోవాలి.

ప్రస్తుతం ఆర్సీబీ ఫైనల్ రేసులో ఉండటంతో క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉంది. ఈ వీకెండ్‌తో ఐపీఎల్ ముగియనుండటంతో, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం మోత మోగించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. పక్కా ప్లానింగ్‌తో ఐపీఎల్ ఫినాలే తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

ఇక ‘పెద్ది’ చిత్రం కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కడం ఇప్పుడు ప్రేక్షకులను కట్టిపడేసే అంశం. ఐపీఎల్ సీజన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న క్రికెట్ మూడ్, ఈ సినిమా విజయానికి సహజంగానే ఎంతగానో దోహదపడుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version