నటిస్తూ దర్శకత్వం చేయబోతున్న డైరెక్టర్ !

నటిస్తూ దర్శకత్వం చేయబోతున్న డైరెక్టర్ !

Published on Aug 16, 2018 5:25 PM IST

క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే.. కాగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో లెంజెండరీ దర్శకుడైన కేవీ రెడ్డిగారి పాత్రలో నటించనున్నారు. అయితే క్రిష్ ఇప్పటికే మహానటి చిత్రంలో కేవీ రెడ్డి పాత్రలో కనిపించనప్పటికీ ఎన్టీఆర్ చిత్రంలో మాత్రం చాలా భావోద్వేగ సన్నివేశాల్లో అరవై సంవత్సరాల వయస్సులో ఉన్న కేవీ రెడ్డిగారి పాత్రను పోషించడం విశేషం.

కాగా ఇప్పుడు జరుగుతున్న రెండువ షెడ్యూల్ లోనే క్రిష్ నటించే సన్నివేశాలు చిత్రకరించనున్నారు. కేవీ రెడ్డిగారి చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిస్థితులను ఈ చిత్రంలో చూపించడంతో పాటుగా కేవీ రెడ్డిగారు ఎన్టీఆర్ గారు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చూపిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు