ఎన్టీఆర్ బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ !

ఎన్టీఆర్ బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ !

Published on Nov 18, 2018 3:35 PM IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే దర్శకుడు క్రిష్ ఈ బయోపిక్ లో కొన్ని ప్రయోగాలు చేసున్నారు.

తాజాగా, సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రచారం చేసినప్పుడు, ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహించిన సభల్లోనూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలనే.. పైగా ఎన్టీఆర్ ఒరిజినల్ వాయిస్ నే సినిమాలో కూడా వాడాలనుకుంటున్నారట.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు