అనసూయ చేయనున్న ఆ స్పైసీ రోల్ ఏమై ఉంటుంది?

anasuya

టాలెంటెడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరున్న కృష్ణ వంశీ కొంచెం విరామం తరువాత ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రకటించి అందరి దృష్టి ఆకర్షించాడు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలలో బ్రహ్మానందం కీలక పాత్ర చేస్తుండగా రంగమార్తాండ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కాగా ఈ మూవీలో ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా ఓ పాత్ర చేస్తున్నారు.

ఐతే నేడు దర్శకుడు కృష్ణ వంశీ రంగ మార్తాండ చిత్రంలో అనసూయ పాత్రను ఉద్దేశిస్తూ ఆమె స్పైసీ రోల్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆఒక్క ట్వీట్ తో అనసూయ చేయనున్న ఆ స్పైసీ రోల్ ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగి పోయింది. సెట్స్ లో ఆమె గెటప్ చూస్తుంటే వంటి నిండా నగలు, పట్టు చీరెలతో ఉన్నారు. ఏదేమైనా దర్శకుడు ఒక్క ట్వీట్ తో అనసూయ పాత్రపై అందరిలో ఆసక్తి కలిగేలా చేశారు. రంగ మార్తాండ మరాఠీ చిత్రం నటసామ్రాట్ చిత్రానికి అనువాదం. 2016లో విడుదలైన ఆ చిత్రం హిట్ మూవీగా నిలిచింది.

Exit mobile version