రజనీకాంత్‌ పై దర్శకుడి ఆరోపణలు

రజనీకాంత్‌ పై దర్శకుడి ఆరోపణలు

Published on Oct 8, 2024 2:30 AM IST

ks eavi kumar rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్‌ పై దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన నెగిటివ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ, రజనీకాంత్‌ పై కె.ఎస్‌.రవికుమార్‌ ఏం కామెంట్స్ చేశాడంటే.. తమ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘లింగ’ సినిమా ఎడిటింగ్‌లో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారని, అందువల్లే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందని కె.ఎస్‌.రవికుమార్‌ అన్నారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)కు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు.

ముఖ్యంగా లింగ సెకండాఫ్‌ మొత్తాన్ని ఆయన మార్చేయడం జరిగింది. అదేవిధంగా అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను కూడా రజనీ తీయించేయడం జరిగింది. పైగా కృతిమంగా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ యాడ్‌ చేశారు. మొత్తానికి ‘లింగ’ను గందరగోళం చేశారు’’ అంటూ రవికుమార్‌ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అసలు ఆయన ఈ కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం ఆయనకు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. ఆ బాధలోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

తాజా వార్తలు