ప్రముఖ దర్శకుడు మణిరత్నం కి గుండెపోటు

Published on Jun 17, 2019 1:39 pm IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఐతే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కంగారుపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు,అభిమానులు ఊపిరి పీల్చుకున్నారట.అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమాలు మణిరత్నం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మణిరత్నంకు తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్‌ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్‌లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.అలాగే వివిధ సందర్భాలలో మరో రెండు సార్లు ఆయనకు గుండెపోటు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా నాలుగోసారి గుండెపోటురావడంతో అందరు ఆందోళనకు గురిఅవుతున్నారు.

ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. విక్రమ్,కార్తీ,ఐశ్వర్య,అనుష్క వంటి భారీ తారాగణంతో ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :

X
More