హాలీవుడ్ ప్రముఖుడు మెచ్చిన మారుతీ కూతురి టాలెంట్.

హాలీవుడ్ ప్రముఖుడు మెచ్చిన మారుతీ కూతురి టాలెంట్.

Published on Jun 5, 2020 1:40 PM IST

దర్శకుడు మారుతీ తన కూతురు హియా దాసరి టాలెంట్ కి పొంగిపొతున్నారు. తన కూతురు విషయంలో గర్వంగా ఫీలవుతున్నట్లు సోషల్ మీడియాలో తన ఆనందం వ్యక్తం చేశాడు. మారుతి కూతురు హియాకు ఫోటోగ్రఫీ హాబీగా ఉంది. ఆమె తన సెల్ ఫోన్ తో క్రియేటివ్ గా తీసిన కొన్ని ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఐతే ఆ ఫోటోలను ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జాన్ విక్ ఫేమ్ డాన్ లాట్సేన్ లైక్ కొట్టారట. అంత పెద్ద డి ఓ పి తన ఫొటోలకు లైక్ కొట్టడంతో ఆ విషయాన్ని హియా సోషల్ మీడియాలో పంచుకుంది.

ఆ విషయాన్ని షేర్ చేస్తూ మారుతి ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఏమైనా ఇది చిన్న విషయం కాదు మరి. ఇక భవిష్యత్తులో మారుతి తన కూతురిని కెమెరా విమెన్ ని చేస్తారేమో. గత ఏడాది ప్రతి రోజు పండుగే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మారుతీ మరో నూతన చిత్ర ప్రకట చేయలేదు. ఆయన ఈ సారి ఓ స్టార్ హీరోపై కన్నేశాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు