ప్రముఖ డైరెక్టర్ ద్వారా ‘రహస్యం’ ట్రైలర్ విడుదల

ప్రముఖ డైరెక్టర్ ద్వారా ‘రహస్యం’ ట్రైలర్ విడుదల

Published on Nov 13, 2018 1:00 PM IST

వంద చిత్రాలకు చేరువలో ఉన్న భీమవరం టాకీస్ బ్యానర్ లో వస్తున్న మరో హర్రర్ చిత్రం..@ రహస్యం..ఈ చిత్రం ఫస్ట్ లుక్ వినాయక చవితి రోజున శ్రీ వి.వి వినాయక్ చేతుల మీదుగా, విజయ దశమి సందర్భంగా.. ప్రముఖ దర్శకులు..శ్రీ రాంగోపాల్ వర్మ..శ్రీ పూరి జగన్నాధ్ గార్ల చేతులమీదుగా థియేటర్ కల్ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు దీపావళి సందర్భంగా దర్శకుడు మారుతీ మరో ట్రైలర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘నూతన దర్శకులకు మార్గదర్శి మా రాంగోపాల్ వర్మగారు.. ప్రతి కొత్త డైరెక్టర్ ఆయన చేతుల మీదుగా తమ సినిమాకి సంబంధించి టీజరో ట్రైలేరో విడుదల చేయించాలి అని కోరుకుంటారు. ఇక ఈ చిత్ర దర్శకుడు సాగర్ శైలేష్ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి.. ఈ సినిమా తీసాడు. ఇదీ కచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు.

మారుతీ మాట్లాడుతూ… సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణ. చిన్న సినిమాలని తీసి విజయవంతంగా విడుదల చేయటంలో అతనికి అతనే సాటి.
డైరెక్టర్ శైలేష్… సినిమాని స్టైల్ గా డైరెక్ట్ చేసాడు. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చిందని చిత్రబృందాన్ని అభినందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు