నేను ఆ టైపు కాదు – దర్శకనిర్మాత మారుతి.

నేను ఆ టైపు కాదు – దర్శకనిర్మాత మారుతి.

Published on Sep 24, 2014 2:53 PM IST

Maruthi
నేను నిర్మాతగా ఇతర దర్శకులు తెరకెక్కించే సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నానని, నేనే దర్శకత్వం చేస్తున్నాని బయట ప్రచారం జరుగుతుంది. సినిమా హిట్ అయిన తర్వాత క్రెడిట్ నా ఖాతాలో వేసుకుంటున్నాను అని విమర్శిస్తున్నారు. అందులో నిజం లేదు. దర్శకుడిగా అయినా, రైటర్ గా అయినా నేను పని చేస్తేనే.. నా పేరు వేసుకుంటాను. నేను పేరు వేసుకున్న శాఖకు సంబందించిన పని మాత్రమే నేను చేస్తాను. ఇతరుల పనిలో వేలు పెట్టడం, తల దూర్చడం వంటివి చేయను. ఇన్వాల్వ్ అవ్వను. సినిమా విజయంలో ఎవరి క్రెడిట్ వారిదే. ఇతరుల క్రెడిట్ నా ఖాతాలో వేసుకునే ప్రయత్నం చెయ్యను. నేను ఆ టైపు కాదు. క్రెడిట్ కొట్టేసే రకం కాదు అని అన్నారు దర్శకనిర్మాత మారుతి.

మొదట ‘ప్రేమ కధా చిత్రమ్’కు దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్ జి.ప్రభాకర్ రెడ్డి పేరు వేశారు. సినిమా విడుదలయ్యి…. విజయం సాదించిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మారుతి దర్శకత్వం వహించారని. తాజాగా విజయం సాదించిన సుమంత్ అశ్విన్ ‘లవర్స్’ సినిమాలో సప్తగిరి ఎపిసోడ్ కి నేనే దర్శకత్వం వహించానని, సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో మారుతి వెల్లడించారు. ఈ సంఘటనలతో మారుతిపై విమర్శలు ఎక్కువయ్యాయి. వీటికి భుదవారం జరిగిన ‘కాయ్ రాజా కాయ్’ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు.

‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమ కధా చిత్రమ్’ అంటూ తెలుగు తెరపై లో బడ్జెట్ సినిమాలతో సంచలనం సృష్టించారు మారుతి తర్వాత తన శిష్యులను, ఇతరులను దర్శకులుగా అనేక లో బడ్జెట్ సినిమాలను నిర్మించారు.

తాజా వార్తలు