ఓ బేబీ డైరెక్టర్ 9ఏళ్ల తరువాత మళ్ళీ….!

ఓ బేబీ డైరెక్టర్ 9ఏళ్ల తరువాత మళ్ళీ….!

Published on Jul 6, 2019 4:26 PM IST

https://cdn.123telugu.com/telugu/wp-content/uploads/2019/06/nandi.jpg

తెలుగులో ఉన్న అతి తక్కువ లేడీ డైరెక్టర్స్ లో నందిని రెడ్డి ఒకరు. ఈమె దర్శకురాలిగా మొదటి సినిమా “అలామొదలైంది” తోనే బ్లాక్ బస్టర్ అందుకొని ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకుంది. ఒక కొత్త కాన్సెప్టుతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “అలామొదలైంది” మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే అప్పుడే కెరీర్ ప్రారంభించిన హీరో నానికి,హీరోయిన్ నిత్యామీనన్ కి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ మూవీ విజయం దోహదపడింది.

కానీ నందిని రెడ్డి ఈ విజయాన్ని చక్కగా ఉపయోగించుకోలేకపోయారు. ఈ చిత్రం తరువాత సమంత,సిద్దార్థ కంబినేషన్లో 2013లో విడుదలైన “జబర్దస్త్”, అలాగే 2016లో నాగ శౌర్య హీరోగా వచ్చిన “కల్యాణ వైభోగమే” ఆశించిన విజయం సాధించకపోవడంతో అవకాశాలు తగ్గాయి. మొదటి సినిమా హిట్టైన తరువాత దాదాపు 9ఏళ్లకు నందిని “ఓ బేబీ” మూవీతో విజయం అందుకుంది. మరి ఈ విజయాన్నైనా ఈ లేడీ డైరెక్టర్ చక్కగా ఉపయోగించుకొని అవకాశాలు అందిపుచ్చుకొని కెరీర్ ని మలుచు కుంటుందో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు