దర్శకుడు పరశు రామ్ పరిశ్రమలో మంచి టాలెంటడ్ రైటర్ అండ్ డైరెక్టర్ అని పేరు అయితే ఉంది గాని, ఆ టాలెంట్ కి తగ్గట్లు సక్సెస్ రావడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు పరుశురామ్ ‘గీత గోవిందం’తో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పరశురామ్ తన తర్వాత సినిమాని ఎవరితో చేస్తాడు. ఏ బ్యానర్ లో చేస్తాడని కొందరు హీరోలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే పరుశు రామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ లో చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా పరుశురామ్ ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ గతంలోనే నిర్మాత బన్నివాసుకు పరశురామ్ కి ఓ ఆసక్తికరమైన కథాంశం చెప్పారట. మనిషికి దేవుడికి మధ్య సాగే ఆ కథ చాలా ఎంటర్ టైనింగా ఉండనుందని చెప్పారు. ప్రస్తుతం పరుశురామ్ ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నానని కూడా చెప్పారు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


