‘సలార్ 2’ ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చిన నీల్!

‘సలార్ 2’ ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చిన నీల్!

Published on May 22, 2026 6:00 PM IST

Salaar 2

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న క్రేజీ లైనప్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సిద్ధంగా ఉన్న చిత్రం సలార్ 2 శౌర్యంగ పర్వం కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ మ్యాడ్ సీక్వెల్ ఈపాటికే మొదలు కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ కాలేదు. అయితే ఈ గ్యాప్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే భారీ సబ్జెక్టులో నీల్ బిజీగా ఉండడం జరిగింది.

దీనితో సలార్ 2 వెనక్కి వెళ్ళింది. అయితే లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ సాలిడ్ క్లారిటీ అందించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం డ్రాగన్ ని పూర్తి చేయడం మీదనే ఉందని ఈ ప్రాజెక్ట్ అయ్యిన వెంటనే మొదలు పెట్టే ప్రాజెక్ట్ నే సలార్ 2 అని ఖాయం చేశారు. సో డ్రాగన్ ఎంత త్వరగా పూర్తయితే సలార్ 2 అంత త్వరగా మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ సలార్ 2 చిత్రం కొంతమేర షూట్ ని కూడా పూర్తి చేసుకుంది. సో కొంచెం ఆలస్యం అయినా ఈ సినిమా కూడా త్వరగానే వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు