కరోనాపై యుద్ధంలో పూరి మార్క్ డైలాగ్ చూశారా?

Published on Mar 24, 2020 8:03 pm IST

కరోనా పై యుద్ధంలో డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన మార్కు సినిమాటిక్ స్టైల్ లో ప్రజలకి సందేశం పంపారు. ‘ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే టైమ్ వచ్చింది. దయచేసి ఆ పని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి..’ అని పిలుపునిచ్చారు డైరెక్టర్ పూరి . కరోనా వైరస్‌ ఊహాతీతంగా విజృంభిస్తోందనీ, దాన్ని అదుపు చేయకపోతే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనిచ్చిన వీడియో సందేశాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన పూరి వచ్చే నెలలో తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఫైటర్ రోల్ చేస్తుండగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More