2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు రాజ్ కిరణ్. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరవాత 2015లో ఆయన చేసిన ‘త్రిపుర’ చిత్రం అంతగా విజయాన్ని సాధించలేదు. దీంతో రాజ్ కుమార్ ఈసారి థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.
ఈ చిత్రాన్ని ఈవుజ్ర్ లాంచ్ చేశారు. అమెరికా, స్విట్జర్ లాండ్ వంటి దేశాల్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు రాజ్ కిరణ్. ఈ చిత్రాన్ని మాధవి అడ్డంకి, రజనీకాంత్.ఎస్ లు నిర్మిస్తున్నారు. ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీ కృష్ణ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. రెగ్యులర్ షూట్ ఎప్పుడు, హీరో హీరోయిన్లు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
