‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రాజమౌళి !

‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రాజమౌళి !

Published on Dec 6, 2018 9:59 PM IST

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈ రోజుతోటి ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుందని చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది.

కాగా మొదటి షెడ్యూల్లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి

భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు