‘ఆవిరి’ ఆకట్టుకుంటుందా ?

Published on Sep 11, 2019 10:56 am IST

టాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్ తో వైవిధ్యమైన చిత్రాలు తీసే దర్శకుల్లో రవిబాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆ మధ్య ‘అదిగో’ అని ఓ పంది పిల్లను ప్రధాన పాత్రగా పేటి .. ఓ ప్రయోగాత్మక సినిమా చేసి విఫలం అయ్యారు. అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో సరికొత్త కంటెంట్ తో రాబోతున్నాడు రవిబాబు. సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్‌ రాజు – రవి బాబు కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. అంతా కొత్తవారితో ‘ఆవిరి’ అనే టైటిల్‌ తో రానున్న ఈ సినిమాను దిల్‌ రాజు విడుదల చేయనున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. రవిబాబు తనకు కలిసి వచ్చిన హారర్ సబ్జెక్ట్ నే మళ్ళీ తీసుకున్నారనిపిస్తోంది. ఓ ఆత్మ బాటిల్ లో బంధింప బడి ఉన్న స్టిల్ ని వదిలారు. మొత్తానికి పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకునేలానే ఉంది. మరి సినిమా ఆకట్టుకుంటుందా అనేదే చూడాలి. ఇక దిల్ రాజ్ ఇటు మహేష్‌ బాబు లాంటి స్టార్‌ లతో సినిమాలు నిర్మిస్తూనే… అటు రాజ్‌ తరుణ్‌ లాంటి యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూనే.. ఆవిరి లాంటి సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ.. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More