’ఒక్క అమ్మాయితప్ప’ కథ ఎలా పుట్టిందంటే…?

’ఒక్క అమ్మాయితప్ప’ కథ ఎలా పుట్టిందంటే…?

Published on May 30, 2016 12:45 PM IST

okka-ammayi-tappa
ఒక ఫ్లైఓవర్ పై జరిగన ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటినుంచీ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ని మహేష్ బాబు మెచ్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

జూన్ 10 న ఈ సినిమావిడుదల అవుతున్న సందర్భంగా 123తెలుగు.కామ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజసింహ తాడినాడ ’ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా కథ గురించి, ఆ కథ ఎలా పుట్టిందన్న దానికి సమాధానం ఇచ్చారు. 2006 లో హైదరాబాద్ లోని మూసాపేట ఫ్లైఓవర్ పై జరిగిన ట్రాఫిక్ జామ్ లో రాజసింహ చిక్కుకున్నప్పుడు ఈ సినిమా కథకు ఆలోచన పుట్టిందని తెలియచేశారు. దాదాపు పదిసంవత్సరాల తర్వాత 2007 లో ఈ సినిమా కథ రాసినట్టు చెప్పారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నిత్యమీనన్ నటించారు.

తాజా వార్తలు