అర్జున్ రెడ్డి డైరెక్టర్ పరిస్థితి ఏమిటీ?

అర్జున్ రెడ్డి డైరెక్టర్ పరిస్థితి ఏమిటీ?

Published on Jun 27, 2020 11:14 PM IST

sandeepvanga
కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తో బాలీవుడ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీపై ఆసక్తి నెలకొని ఉంది. ఐతే ఆయన ఇంత వరకు అధికారికంగా ఓ మూవీ ప్రకటించలేదు. చాల రోజుల క్రితం కబీర్ సింగ్ నిర్మాతలతో మరో హిందీ మూవీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ తన వద్ద ఉన్న స్టోరీ లైన్స్ తో ప్రభాస్ , మహేష్ వంటి టాప్ స్టార్స్ ని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి.

ఏదిఏమైనా ఆయన నుండి అధికారిక ప్రకటన రాలేదు. సందీప్ తీరు చూస్తుంటే ఆయనకు బాలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ సినిమా చేయడానికి హీరో దొరకలేదు అని తెలుస్తుంది. కాబట్టి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త మూవీ ప్రకటించడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. 2017 లో ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి విడుదల కాగా దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ 2019లో విడుదల అయ్యింది .

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు