ఖర్చు తగ్గించి షూటింగ్ చేస్తున్న శంకర్

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. మొదట్లో ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. లైకా నిర్మాతలు ఖర్చు తగ్గిస్తేనే సినిమా అని తేల్చి చెప్పడంతో మొదట్లో బెట్టు చేసినా మెల్లగా ఆ నిబంధనకు ఒప్పుకున్నారు శంకర్.

అందుకే ప్రతి ఇండోర్ సన్నివేశానికి తన అభిరుచికి తగ్గట్టు సెట్ వేయించుకునే శంకర్ ఈసారి అలా చేయడం లేదు. వీలైనంతవరకు సెట్స్ అవసరం లేకుండానే ఇండోర్ షూట్ లాగించేస్తున్నారట. అందులో భాగంగానే కమల్ హాసన్ చేయాల్సిన ఒక హోటల్ సన్నివేశాన్ని సెట్ వేయకుండా చెన్నైలోని ఒక హోటల్లో కానిచ్చేస్తున్నారు. మొత్తానికి శంకర్ సినిమా కోసం అడ్జెస్ట్ అయ్యారు.

ఇకపోతే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version