మెగా డైరెక్టర్ కి మాతృ వియోగం !

Published on May 17, 2021 7:08 pm IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా అయినవారిని పోగొట్టుకుని కొన్ని కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, వెంటలేటర్ బెడ్స్ దొరక్క ప్రాణాలు కోల్పోవడంతో అది కుటుంబ సభ్యులను మరింతగా బాధ పెడుతుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు తల్లిగారు మంగమ్మ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆమె మృతి చెందినట్లుగా సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఎంతగా ట్రై చేసినా.. సుబ్బు మదర్‌ని కాపాడుకోలేకపోయాం’ అంటూ సాయి ధరమ్ పోస్ట్ చేశారు.

తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో సుబ్బు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సాయితేజ్, థమన్ వంటి వారంతా ట్వీట్స్ చేస్తూ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. సెలబ్రిటీల ఫ్యామిలీ మెంబర్స్ కే బెడ్స్ దొరక్కపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం దొరుకుతాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాలి.

సంబంధిత సమాచారం :